తమిళనాడులో బాల్య వివాహం చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే…. బాల్య వివాహం చేసుకుంటున్న చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల చిన్నారిని బెంగుళూరులోని 38 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి బాల్య వివాహం చేశారు.

అత్తగారి ఇంటికి వెళ్ళనని ఆ చిన్నారి ఏడుస్తున్నా, భుజాలపై ఎత్తుకొని బలవంతంగా తీసుకెళ్లాడు పెళ్లి కొడుకు. ఇక ఈ విషయం తెలిసి భర్తను, భర్త తమ్ముడిని, బాలిక తల్లిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారందరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… విచారణ చేస్తున్నారు. దీంతో బాల్య వివాహం చేసుకుంటున్న చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి.
తమిళనాడులో బాల్యవివాహాం
కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు
తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల చిన్నారిని బెంగుళూరులోని 29 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి బాల్య వివాహం చేశారు
అత్తగారి ఇంటికి వెళ్ళనని ఆ చిన్నారి ఏడుస్తున్నా,… pic.twitter.com/RDVdc0uLFu
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2025