అంగన్వాడీలకు చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ వయస్సు 62ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీని కూడా పెంచింది.

ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల కుటుంబాలకు బిగ్ అలర్ట్. సూసైడ్ చేసుకున్న రైతుల కుటుంబాలకు 7 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది జూన్ మాసం నుంచి ఇప్పటివరకు 39 మంది రైతులు అలాగే కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు.