పులివెందుల వదిలి కర్ణాటక నుంచి జగన్ పోటీ చేస్తాడంటూ సెటైర్లు పేల్చారు జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. ఏపీ బ్రాండ్ ఇమేజ్ 2019-2024 వరకు ఏమైందో అందరూ చూసారని…ప్రతిపక్షం కోసం అవకాశం ఇవ్వాలని జగన్ ప్రవర్తించే తీరు చాలా అసహ్యంగా ఉందని వివరించారు. మొన్నటి వరకు ఈవీఎం లు వల్లే ఓడిపోయాం అని అన్నారు, మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో అత్యధిక మెజారిటీ వచ్చామన్నారు సుందరపు విజయ్ కుమార్.

ప్రజల సమస్యలపై శాసన సభలో మాట్లాడకుండా ప్రతిపక్షం కావాలని అడుగుతున్నావు… ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్లకి పరిమితం అవుతున్నావ్ అంటూ చురకలు అంటించారు. సొంత చెల్లి, ఒక హీరో పేరుతో నీ సొంత సోషల్ మీడియాని ఉపయోగించుకుని తిట్టించావ్ అంటూ ఆగ్రహించారు. మా నాయకుడు మాకు నేర్పించిన సంస్కారంతో మేము రాజకీయాలు చేస్తున్నామని చురకలు అంటించారు. మా నాయకుడు మాకు నేర్పించిన విలువల వల్లే మేము ఏమి అనట్లేదన్నారు. భవిష్యత్తులో పులివెందుల వదిలి కర్ణాటక నుంచి జగన్ పోటీ చేస్తాడేమో అంటూ సెటైర్లు పేల్చారు జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్.