కాంగ్రెస్, బీజేపీల బంధం కొనసాగుతోంది.. బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు

-

రాష్ట్రంలో కాంగ్రెస్ -బీజేపీ బంధం కొనసాగుతోందని, ఈ 16 మంది ఎంపీల వల్ల రాష్ట్రానికి – ఒరిగింది ఏమి లేదని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి  అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం, మంత్రుల మాటలను చూస్తుంటే రాష్ట్రంలో సుతి, మతి, గతి లేని ప్రభుత్వం ఉందని అర్ధమవుతుందని, సీఎం, మంత్రుల మధ్య సమన్వయం లేదని ఆరోపించారు. ఓ వైపు సీఎం ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు అంటున్నారని, ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చినప్పుడు తమకు ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు అని, నెలకు 500 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడి వ్యయం చేసే స్థితి లేమని సీఎం అంటున్నారని వ్యాఖ్యానించారు.

మరోవైపు అహ్మదాబాద్ కన్నా హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలు బాగున్నాయని ఒలింపిక్స్
నిర్వహిస్తామని అంటున్నారని.. సీఎం మాటలతో రాష్ట్ర పరువు తీస్తున్నారని మండిపడ్డారు. మిస్ వరల్డ్
పోటీలకు, ఒలింపిక్స్ నిర్వహణకు అసలు సంబంధం ఉందా? అని, సీఎం రేవంత్ రెడ్డి మాటలు జోకర్  మాటలు అని హాట్ కామెంట్స్ చేశారు. గత ఒలింపిక్స్  నిర్వహణకు లక్షన్నర కోట్ల రూపాయల ఖర్చు అయ్యిందని, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఒలింపిక్స్ నిర్వహణ నుంచి పారిపోతున్నాయని.. కానీ మింగ మెతుకు లేదు.

Read more RELATED
Recommended to you

Latest news