చిరంజీవి, పవన్ కళ్యాణ్ వద్ద అప్పు తీసుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కొణిదెల నాగబాబు అఫిడవిట్‌లో ఆస్తుల, అప్పుల వివరాలు తెలిపారు. మ్యూచ్‌వల్ ఫండ్స్/బాండ్లు రూ.55.37 కోట్లు, బ్యాంకులో సేవింగ్స్ రూ.23.53 లక్షలు, చేతిలో నగదు రూ.21.81లక్షలు, మొత్తం స్థిరాస్తులు రూ.11 కోట్లు, చరాస్తులు రూ.59 కోట్లు, ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ.1.08 కోట్లు ఉన్నాయి.

కాగా, చిరంజీవి వద్ద రూ.28 లక్షలు, పవన్ కల్యాణ్ వద్ద రూ.6 లక్షలు అప్పు తీసుకున్నారు. కాగా… ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కొణిదెల నాగబాబుకు కూటమి మరో పదవి ఇవ్వనుందట. మంత్రి పదవికి కూడా కొణిదెల నాగబాబుకు ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.