SLBC టన్నెల్ ప్రమాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. SLBC టన్నెల్ లో మానవ చర్మం గుర్తించారు. టన్నెల్లో మానవ అవశేషాలను గుర్తించారు. నిన్న(శనివారం) రాత్రి కేరళకు చెందిన జాగిలాలు మనుషుల ఆనవాళ్లను గుర్తించడంతో మట్టి తొలగింపును ముమ్మరం చేశారు. అక్కడ మానవ చర్మం బయటపడింది.

దీంతో మరింత లోపలికి వెళ్లేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. టీబీఎం మెషీన్ను కట్ చేస్తూ మట్టిని తొలగిస్తూ కార్మికుల బాడీల కోసం గాలిస్తున్నారు.