అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. మదనపల్లి-చింతామణి రోడ్‌లో.. మూలమలుపు వద్ద కారు, బస్సు ఢీకొట్టుకున్నాయి. ఈ తరుణంలోనే…. కారులో మంటలు చెలరేగడం జరిగింది.

ఇంకే ముంది… మంటలు ఎగిసిపడటంతో… అందులోని ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. అటు కారులో ఉన్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కారు పెట్రోల్ ట్యాంకర్ లీకవ్వడంతో.. మంటలు చెలరేగాయని సమాచారం అందుతోంది. ఇక అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.