నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

-

నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరుగనున్నాయి. నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు కానున్న తరుణంలోనే.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ రెడీ అయింది. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి మణిపూర్ లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నందున, మణిపూర్ బడ్జెట్ అంచనాలను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.

Second phase of budget sessions from today

మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పెట్టిన అంశాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకురానున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. డీలిమిటేషన్, వక్ఫ్ సవరణ బిల్లు, ఓటర్ల జాబితాలో అవకతవకలు, అమెరికా టారిఫ్ లు , దేశవ్యాప్తంగా కులగణన అంశాలపై ఆందోళనకు సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు. ఇక ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంటుంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్లమెంటరీ పార్టీ సమావేశం లో చర్చ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news