ఏపీలోని అరసవెళ్లి శ్రీ సూర్యానారయణ స్వామి ఎంతో ప్రసిద్ధి గాంచినదో అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు క్యూ కడుతుంటారు. అయితే, సూర్యకిరణాలు ఆలయంలోని మూల విరాట్‌ను తాకడం ఇక్కడి ప్రత్యేకత..
అయితే, నేడు సూర్యనారాయణ స్వామి వారిని సూర్య కిరణాలు తాకలేదని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దివ్యక్షేత్రంలో సూర్యకిరణాలు మూలవిరాట్టును తాకే అద్భుత ఘట్టం కోసం పెద్దఎత్తున భక్తులు విచ్చేశారు. ఏటా దక్షిణాయణం అక్టోబర్ 1, 2 తేదీల్లో, ఉత్తరాయణంలో మార్చి 9, 10 తేదీల్లో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమయ్యేది.కానీ, ఈసారి పొగమంచు కారణంగా స్వామివారిని సూర్య కిరణాలు తాకకపోవడంతో భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు.