అర్ధరాత్రి గాంధీ భవన్ వద్ద హైటెన్షన్.. (వీడియో)

-

ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ప్రకటించిన లిస్టులో ముస్లింలకు ప్రాధాన్యం ఇవ్వలేదని అర్ధరాత్రి గాంధీ భవన్ వద్ద మైనార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి 2 గంటలకు గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ ముస్లిం నేతలు ఆందోళనకు దిగారు.

కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకులను కావాలనే పక్కనపెట్టిందని వారు ఆరోపించారు. రాష్ట్రంలో 14% ముస్లిం జనాభా ఉన్నా.. ఒక్క ముస్లిం అభ్యర్థికీ అవకాశం ఇవ్వలేదని మైనారిటీ నేతలు మండిపడ్డారు.అనంతరం నిరసనకారులను అదుపులోకి తీసుకుని బేగంబజార్, ముషీరాబాద్ స్టేషన్లకు పోలీసులు తరలించారు.

https://twitter.com/TeluguScribe/status/1898962249361809805

Read more RELATED
Recommended to you

Latest news