పిఠాపురం వర్మకు పదవి రాకుండా కుట్రలే చేయలేదు – నాదెండ్ల

-

పిఠాపురం వర్మకు పదవి రాకుండా కుట్రలే చేయలేదన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ వల్లనేననంటూ బాంబ్‌ పేల్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే అది కేవలం జనసేన పార్టీ వల్లనేనన్నారు. తాజాగా కాకినాడలో కార్యకర్తల సమావేశంలో జనసేన ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అన్నారు. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్ అని కొనియాడారు.

nadendla manohar comments on babu and pawan varma

వాళ్ళ పార్టీ ఆయన విషయం లో నిర్ణయం తీసుకుంటుంది,ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు. వర్మ ని గౌరవించడం లో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చారు. వర్మ కి చెక్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉంటుందని చురకలు అంటించారు. పవన్ సెక్యూరిటీ విషయం లో డిపార్ట్మెంట్ తో పాటు పార్టీ పరంగా మేము కూడా చూసుకుంటామని ప్రకటించారు. సభా ప్రాంగణం లో 75 సి సి కెమెరా లు ఏర్పాటు చేస్తామన్నారు. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేసామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news