బట్టలు విప్ప కొడ్తాం.. బీఆర్ఎస్ నేతలకు మెట్టు సాయికుమార్ వార్నింగ్

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శల మీద తాజాగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఘాటుగా స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ మీద, సీఎం రేవంత్ మీద చిల్లర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

‘ఇంకోసారి మీరు గానీ, మీ చెంచాగాళ్లు గానీ, మీ సోషల్ మీడియా గానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చిల్లరమల్లరగా వ్యవహరిస్తే బట్టలిప్పి కొడ్తాం. ఒంటిమీద ఒక్క బట్ట ముక్క లేకుండా కొడ్తాం’ అని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ ఘాటు విమర్శలు చేశారు. కాగా, ఎల్‌ఎల్‌బీసీ ప్రమాదం మొదలుకుని రైతుభరోసా, రుణమాఫీ, రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు విమర్శిస్తున్నారు.

https://twitter.com/Telugu_Galaxy/status/1899373810656374970

Read more RELATED
Recommended to you

Latest news