IPL : కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం..

-

చాంపియన్స్ ట్రోఫీ-2025లో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో తన వంతు కీలక పాత్ర పోషించిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ప్రారంభానికి ముందు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత సీజన్‌లో లక్నో సూపర్ జెయంట్స్‌కు కెప్టెన్‌గా ఉన్న రాహుల్.. ఈ సీజన్‌లో ఢిల్లీ తరఫున ఆడనున్నారు.

అయితే, ఈ సీజన్‌లో కెప్టెన్సీకి దూరంగా ఉండాలని కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఢిల్లీ మేనేజ్మెంట్‌కు సైతం వివరించినట్లు సమాచారం. బ్యాటింగ్ మీద శ్రద్ధ పెట్టేందుకు ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలిసింది. కాగా, కేఎల్ రాహుల్ తప్పుకోవడంతో ఢిల్లీ కెప్టెన్‌గా అక్సర్ పటేల్ నియామకం లాంఛనం కానుందని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news