వైసిపి నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసిపి నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ తాజాగా పోలీసులకు లొంగిపోయాడు. వైసిపి నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ను పిటి వారెంట్ పై తీసుకుని వెళ్లేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు గుంటూరు పోలీసులు.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు బోరుగడ్డ అనిల్ కుమార్. ఇక ఇవాళ గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు అనిల్ పై నమోదు చేసిన పీటీ వారెంట్ పై విచారణ జరుగనుంది. మరికొద్ది సమయంలో అనిల్ కుమార్ ను గుంటూరు పోలీసులకు అప్పగించనున్నారు సెంట్రల్ జైలు అధికారులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.