మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని అడ్డుకున్న పోలీసులు.. ఎందుకంటే?

-

ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని‌ బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా రెంటచింతలలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు పిన్నెల్లి వెళ్తున్నారు.

ఊరి శివారులోనే రామకృష్ణారెడ్డిని పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. ‘మీకు పర్మిషన్ లేదు.ఉర్లోకి రావద్దంటూ పోలీసులు అడ్డుకున్నారు. మేము ర్యాలీ చేయం. మైకు వాడకుండా విగ్రహానికి పూలదండ వేసి వెళ్తామన్న కూడా పోలీసులు ఒప్పుకోకపోవడంతో చేసేదేమీ లేక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి వెనుదిరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news