కూటమి ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిందని.. ఇంత వరకు ఆ ఊసే లేదని మాజీ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి విమర్శించారు. సమున్నత ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రీయింబర్స్ మెంట్ ను ప్రభుత్వం నీరు గారుస్తోందని.. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది తల్లికి వందనం ప్రాజెక్్ట్ ని ఎగ్గొట్టారని.. వచ్చే ఏడాది నుంచి ఇస్తామని చెబుతున్నారని మండిప్డారు.
వైసీపీ హయాంలో విద్యారంగం ఎంతో పటిష్టంగా తయారైందని.. మాజీ మంత్రి కాకాణి చెప్పుకొచ్చారు. నెల్లూరులో వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం జరిగింది. వీఆర్ కళాశాల సెంచర్ నుంచి కలెక్టర్ వరకు ర్యాలీ కొనసాగింది. సమున్నత ఉద్దేశంతో ప్రవేవపెట్టిన ఫీజు రీయంబర్స్ మెంట్ ను ప్రభుత్వం నీరు గారుస్తోంది అన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ మెడకల్ కళాశాలలను కూడా ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుందని తెలిపారు.