చంద్రబాబు నాయుడు దారుణంగా దిగజారి పోయారు : కేఏ పాల్

-

జనసేన ఆవిర్భావ సభకు వందల కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి. ఈ సభ జనసేనదా.. లేక టీడీపీదా అన్న విషయం టీడీపీ నాయకులకే అర్థం కావడం లేదు అని కేఏ పాల్ అన్నారు. దత్తపుత్రుడని చంద్రబాబు దగ్గరికి తీసుకున్నాడు ఇప్పుడా దత్తపుత్రుడే పామై కాటేయ్య బోతున్నాడా.. బీహార్ కు రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించి ఆంధ్రప్రదేశ్ కు అందులో 10 శాతం మాత్రమే కేటాయింపులు జరపడంలో ఆంతర్యం ఏమిటి.. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి నిధులు రాకుండా ఆపుతున్నాడని నాకు సమాచారం ఉంది.

అభివృద్ధి జరిగితే చంద్రబాబు మళ్ళీ సీఎం అవుతారేమోనని పవన్ కళ్యాణే అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. తొమ్మిది నెలల్లోనే చంద్రబాబును మింగే స్థాయికి పవన్ కళ్యాణ్ చేరుకున్నాడు. చిరంజీవి 18 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్లో తన పార్టీ విలీనం చేసుకున్నాడు. చంద్రబాబు టీడీపీనే జనసేనలో విలీనం చేసే పరిస్థితిలో ఉన్నారా.. అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు తొమ్మిది నెలల్లో దారుణంగా దిగజారి పోయారు.. రానున్న రెండు మూడు ఏళ్ళలోపరిస్థితి ఏమిటి. ఇస్తానన్న హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకపోతే చంద్రబాబును ఎవరు నమ్ముతారు అని కేఏ పాల్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news