వేములవాడ రాజన్న దర్శనంకు వస్తున్నట్లు అఘోరి చెప్పడంతో.. జిల్లా సరిహద్దులో అఘోరిని అడ్డుకున్నారు పోలీసులు. అందువల్ల పోలీసులతో వాగ్వాదానికి దిగింది అఘోరి. కారు దిగడానికి అఘోరి ప్రయత్నించగా.. అడ్డుకున్నారు పోలీసులు. అఘోరిని నిలువరిస్తున్నా వినకుండా పోలీసులతో వాగ్వాదం చేసింది అఘోరి. అయినా బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో బ్లెడ్ తో ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది అఘోరి.
ఆ తర్వాత భారీ ఉద్రిక్త మధ్య కారును నిలువరించడానికి పోలీసులు యత్నించగా.. కారుని స్టార్ట్ చేసుకొని పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు యత్నం చేసింది. కానీ కారుకు అడ్డుగా నిలబడి అడ్డుకున్నారు పోలీసులు. అందువల్ల స్వల్పంగా గాయపడింది అఘోరి. అయినా కారును ముందుకి తీయడంతో ఒక్కసారిగా పోలీసులు అడ్డుకొని అద్దాలు పగలగొట్టి అడ్డుకునేందుకు యత్నం చేసారు. వెనుక టైర్లకు టోషన్ వేసి తీసుకువెళ్లారు పోలీసులు. ఇక కారు దిగి పోలీసులతో వాగ్వాదంతో బయటకి వచ్చిన అఘోరినీ పోలీసు వాహనంలో ఎక్కించి హైదరాబాద్ కి తరలించారు పోలీసులు.