రాష్ట్రంలో ఎప్పుడు కరెంట్ ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఒకప్పుడు ఉండేది. నేను పాదయాత్ర చేసినపుడు కొన్ని సంఘటనలు నన్ను కలిచి వేసాయి అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం 9 గంటలు రైతులకు నిర్విరామంగా కరెంట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. విద్యుత్తు రంగంలో ఎన్నో సంస్కరణలు టీడీపీ తెచ్చింది. కరెంట్ బిల్లుల విషయంలో కీలక సంస్కరణలు తెచ్చా. నన్ను ప్రపంచ బాంక్ జీతగాడు అన్నా కూడా పడ్డా.
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా విద్యుత్ వినియోగం ఆధారంగానే ప్రజల అభివృద్ధిని లెక్కిస్తారు. కొన్నేళ్లుగా విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మర్పులు వచ్చాయి. గతంలో కరెంటు కోతల సమయంలో రైతుల అవస్థలు ప్రత్యక్షంగా పరిశీలించా. రైతుల ఇబ్బందులు చూసాక పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. విద్యుత్ సంస్కరణలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రపంచ బ్యాంకు జీతగాడని అవహేళన చేశారు. అప్పుడే డిస్కమ్ లు, నియంత్రణ మండలి, ఎనర్జీ ఆడిటింగ్ అనేది మొదలు పెట్టాం. గతంలో ట్రాన్స్ మిషన్ నష్టాలు 23 శాతం అని దేశంలో తొలిసారి నిర్ధారించింది కూడా ఏపీనే. విభజన తర్వాత కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాం. ఒక అసమర్ధ పాలన వల్ల చీకటి రోజులు వచ్చాయి. అలోచన లేకుండా పీపీఏలను రద్దు చేశారు అని సీఎం పేర్కొన్నారు.