అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ శాసనమండలి ఆవరణలో మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. పసుపు రైతులకు మద్దతుగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనను కవర్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
మీడియా పాయింట్‌లో మాత్రమే విజువల్ రికార్డ్ చేసుకోవాలంటూ వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.మండలి ఆవరణలో కవరేజ్‌కి పర్మిషన్ లేదంటూ కెమెరామెన్లను అడ్డుకునే యత్నం చేశారు. కవరేజ్ చేస్తున్న కెమెరామెన్ల కెమెరాలు లాక్కునే యత్నం చేసినట్లు సమాచారం. గతంలో ఇలాంటివి లేవని, కొత్తగా ఈ ఆంక్షలు ఏంటని పోలీసులను జర్నలిస్టులు ప్రశ్నించడంతో పాటు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
శాసనమండలి ఆవరణలో మీడియాపై పోలీసుల అత్యుత్సాహం
పసుపు రైతులకు మద్దతుగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన కవర్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం
మీడియా పాయింట్ లో మాత్రమే విజువల్ రికార్డ్ చేసుకోవాలంటూ అడ్డుకునే యత్నం
శాసనమండలి ఆవరణలో కవరేజ్ కి పర్మిషన్ లేదంటూ కెమెరామెన్లను… pic.twitter.com/6ssqTqvTqD
— TNews Telugu (@TNewsTelugu) March 15, 2025