వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ సీఎం జగన్ బాబాయ్ హత్య జరిగి ఆరు సంవత్సరాలు పూర్తయిన ఈ కేసులో న్యాయం జరగలేదని ఆమె కూతురు వైఎస్ సునీత వ్యాఖ్యానించారు. తన తండ్రి హత్య కేసులో సంబంధం ఉన్న వారంతా దర్జాగా బయటే తిరుగుతున్నారని శనివారం మీడియాకు వివరించారు.
నిందితుల్లో ఒకరు తప్ప మిగిలిన నిందితులు అంతా బయట ఉన్నారని.. ఈ కేసులో నిందితులకన్నా మేమే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్, ట్రయల్‌లో లోపాలు జరిగాయని.. అంతేకాకుండా ఈకేసుతో ప్రమేయం ఉన్నవారు, సాక్ష్యులు ఒక్కొక్కరిగా మృతి చెందడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు.