సంగీత దర్శకుడు AR రెహమాన్ హెల్త్ బులిటెన్ విడుదల అయింది. ఎ.ఆర్. రెహమాన్ ఛాతి నొప్పి వచ్చింది. దీంతో వెంటనే ఎ.ఆర్. రెహమాన్ ను ఆస్పత్రిలో చేర్పించారట ఆయన వ్యక్తిగత సిబ్బంది. ఎ.ఆర్. రెహమాన్ అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు.

ఈ తరుణంలోనే… సంగీత దర్శకుడు AR రెహమాన్ హెల్త్ బులిటెన్ విడుదల అయింది. ఛాతీ నొప్పితో బాధపడుతున్న రెహమాన్ కు కార్డియాలజీ విభాగం వైద్యులు చికిత్స చేస్తున్నారు. AR రెహమాన్ ఆరోగ్యం బాగానే ఉంది.. ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న ఆసుపత్రి వర్గాలు.. ఈ మేరకు ప్రకటన చేశాయి.