కేసీఆర్ తెలంగాణ జాతిపిత..రేవంత్ బూతుల పిత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. బయట బూతులు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో నిజాలు మాట్లాడుతారు అనుకున్నామని ఫైర్ అయ్యారు. కానీ బూతులతో పాటు, అబద్దాలు మాట్లాడారని ఆగ్రహించారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే రేవంత్ రెడ్డి బూతు పిత అయ్యారని చురకలు అంటించారు.
బూతు సినిమా కు పనికొచ్చే స్క్రిప్ట్ లాగా సీఎం స్పీచ్ ఉందని… అబద్ధాల కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అంటూ చురకలు అంటించారు.అబద్ధాలకు gst వేయాలి అన్నారన్నారు. అబద్దాలకు gst వేస్తే రాష్ట్ర ఆదాయం అంతా రేవంత్ రెడ్డి అబద్ధాల కే సరిపోతుందని ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే సొంత పార్టీ నేతలను ట్రోలింగ్ చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిదన్నారు. రేవంత్ రెడ్డి ఇస్ ది ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నరేటివ్స్, ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్, ఫాదర్ ఆఫ్ ఫౌల్ లాంగ్వేజ్, ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సినర్స్ అంటూ వ్యాఖ్యానించారు హరీష్ రావు.