రేపు రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ల ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ప్రజా భవన్ లో జరిగిన సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల చైర్మన్ లు పాల్గొన్నారు.

రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై చర్చ జరిగింది. ఇక రేపు రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ల ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశంగా రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయనుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మేరకు రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ల ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.