నియోజకవర్గానికి 5వేల మందికి సాయం : సీఎం రేవంత్ రెడ్డి

-

రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నిరుద్యోగులకు అర్హత ప్రకారం.. అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్కొక్కరికీ రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు మంజూరు చేస్తామన్నారు. రాబోయే 2 నెలల్లో డబ్బులు మీ చేతుల్లో పెడతాం. జూన్ 02న 5 లక్షల మంది లబ్ధిదారులను ప్రకటిస్తాం. నియోజకవర్గానికి 5వేల మందిని ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.

చిన్న చిన్న ప్రాంతాల్లో గంజాయి ఎక్కువైపోయింది. కొకైన్ ఎక్కువైంది. వేగంగా తెలంగాణను ఆక్రమించుకుంటాయి. ఓనాడు ఉద్యమాలకు నిలువైన కాలేజీలు.. ఇప్పుడు ఉద్యోగం, ఉపాధి లేక వీటి వైపు బానిసలు అవుతున్నారు. తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీకి చేరుకోవాలంటే యువత ఉద్యోగం, స్వయం ఉపాధి కల్పించాలని రాజీవ్ యువ వికాసం పథకం తీసుకొచ్చామని తెలిపారు. జూన్ 02వ తేదీన పకడ్బందీగా లబ్దిదారులకు స్వయం ఉపాధి కల్పించేవిధంగా వారి అర్హతలను బట్టి వారిని ఎంపిక చేస్తామని తెలిపారు. సరైన లబ్దిదారులను ఎంపిక చేయాలని అధికారులను సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news