హైడ్రా కూల్చివేత‌లు.. సాయంత్రానికి సీసీ రోడ్డు..!

-

కిస్మత్ పురలో ఈరోజు ఉద‌యం హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేత‌లపనులు చేసింది. అయితే ఆ వెంటనే సాయంత్రానికి సీసీ రోడ్డు వేశారు మున్సిపల్ అధికారులు. అయితే బండ్ల‌గూడ జాగీర్ మున్సిపాలిటీ ప‌రిధిలోని కిస్మ‌త్‌పురాలో రెండు కాలనీలను కలిపే ర‌హ‌దారిక పై అడ్డంగా నిర్మించిన ప్ర‌హ‌రీని తొలగించారు హైడ్రా అధికారులు. దాంతో సాయంత్రానికి అక్క‌డ సిమ్మెంట్ రోడ్డును వేయించింది బండ్ల‌గూడ జాగీర్ మున్సిపాలిటీ.

ఫార్చ్యూన్ వెస్ట్ మెడోస్ – శ్రీ హ‌ర్షిత్ లే ఔట్‌ల మ‌ధ్య ఉన్న రోడ్డు ఆక్రమించి కట్టిన కూల్చివేత‌తో ప‌రిస‌ర కాల‌నీల‌కు రోడ్డు క్లియర్ అయ్యింది. రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడను 6 నెలల క్రితం కూల్చివేశారు మున్సిప‌ల్ అధికారులు. కానీ మళ్ళీ తిరిగి అక్రమంగా గోడ నిర్మించారు శ్రీ హ‌ర్షిత్ లేఔట్ నిర్వాహకులు. క్షేత్ర స్థాయిలో స్థాయిలో విచారించి రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడను ఈరోజు ఉదయం హైడ్రా తీసివేసింది. దాంతో మళ్ళీ గోడ కట్టడానికి ఆస్కారం లేకుండా సాయంత్రానిక‌ల్లా సిమ్మెంట్ రోడ్డు వేసారు మున్సిపల్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news