సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ హత్య జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాలలో మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత చక్రయ్య గౌడ్ (61) పై నిన్న గొడ్డళ్లతో దాడి చేశారు కొందరు దుండగులు.

పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా చక్రయ్య గౌడ్ పై మూకుమ్మడిగా మారణాయుధాలతో దుండగులు దాడి చేసారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చక్రయ్య గౌడ్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.