తెలంగాణలో మద్యం ధరలు మరోసారి పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం మద్యం ధరలను 18% పెంచే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
బ్రాండీ, విస్కీ, జిన్, రమ్ ధరలను 18% పెంచే నిర్ణయానికి సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి చేరినట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవలే బీర్ల సరఫరా కంపెనీల రిక్వెస్ట్ మేరకు ప్రభుత్వం బీర్ ధరలను 15% పెంచిన విషయం తెలిసిందే. దీంతో అన్ని రకాల కంపెనీల బీర్లధరలు సుమారు రూ.20 నుంచి 30 వరకు పెరిగాయి. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని మందుబాబులు తీవ్రంగా వ్యతిరేకించారు.