ఎండాకాలం ఇంకా పూర్తిగా సమీపించకముందే చౌటుప్పల్, నారాయణపూర్ జిల్లాల్లో నీటి గోస నెలకొందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు.అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తన నియోజకవర్గంలోని నీటి సమస్యలను సభలో లేవనెత్తారు.
ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతంగా తన సెగ్మెంట్ మునుగోడు ఉందని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి నల్లా అని చెప్పి మిషన్ భగీరథకు రూ.50వేల కోట్లు అప్పు తీసుకొచ్చిందని..ఫైలాన్ నిర్మించిన చౌటుప్పల్ పట్టణంలోనే నీళ్లు లేవని చెప్పుకొచ్చారు.మిషన్ భగీరథ కోసం వేల కోట్ల అప్పులు చేసి నిర్మించిన ప్రాజెక్టు వలన కాంట్రాక్టర్లు బాగుపడ్డారు కానీ..దాని ఫలితాలు ప్రజలకు సరిగ్గా అందలేదన్నారు.ఎండల తీవ్రత వలన నారాయణపూర్, చౌటుప్పల్ మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని చెప్పారు.