పత్రికలు, జర్నలిస్టుల పై ఆంక్షలు పెట్టడం పిచ్చి చర్య : కాసం వెంకటేశ్వర్లు

-

భావితరాలకు ఉపయోగ పడే యూనివర్సిటీ లాండ్స్ తెగనమ్మి పబ్బం గడుపుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. దేశం లో నాలుగో స్థానం లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ భూమి నీ బరితెగించి అమ్మకానికి పెట్టారు అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఫుట్ బాల్ ఆడుకోవడానికి వెళ్లి వాటి పై కన్నేశారు.. అప్పుడు కెసిఆర్ భ్రష్టు పట్టించారు…. ఇప్పుడు రేవంత్ రెడ్డీ చేస్తున్నారు. HCU ను లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటారు. నువ్విచ్చిన ఫాల్స్ ప్రామిసెస్ కోసం ఆ భూములను అమ్మాలని అనుకుంటున్నావు.

రేవంత్ రెడ్డి చదువు రాని రాజకీయ నాయకుడు… అయన చేతుల్లో రాష్ట్రం తల్లడిల్లి పోతుంది. శాసన సభ నడుస్తున్న సమయం లో బీజేఎల్పీ నేత ను అరెస్ట్ చేసి నగరమంతా తిప్పడాన్ని ఖండిస్తున్నాం. ఇది అనాగరికమైన చర్య… దుర్మార్గం చర్య. ఉస్మానియా వర్శిటీ ఎన్నో ఉద్యమాలకు వేదిక అయింది. ఓయూ లేకుంటే నువ్వు ముఖ్యమంత్రి వి అయ్యే వాడివి కావు రేవంత్ రెడ్డి. ఉద్యమాలు చేయొద్దని సర్క్యులర్ జారీ చేసిన నీకు విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదు. పత్రికలు, జర్నలిస్టు ల పై ఆంక్షలు పెట్టడం పై పిచ్చి చర్య. జర్నలిస్టు లు అంటే ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి. రేవంత్ నువ్వు అధికారం లోకి ఎలా వచ్చావో మర్చిపోయావా.. ఆయన ఇచ్చిన 7 వ గ్యారంటీ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని పోలీస్ ల చేతిలో పెట్టారు. కెసిఆర్ కబ్జా చేసిన భూములను లాక్కొచ్చి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పిన రేవంత్.. ఆ పని ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించారు కాసం వెంకటేశ్వర్లు.

Read more RELATED
Recommended to you

Latest news