ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడట. ఈ నిర్ణయంతో భారత్కు షాక్ తగిలే ఛాన్స్ ఉందని అంటున్నారు. వెనిజులా నుంచి చమురు కొనే దేశాలు ఇకపై తమతో చేసే ఏ వ్యాపారంలోనైనా 25 శాతం అదనపు సుంకం కట్టాల్సిందేనని తేల్చిచెప్పారట ట్రంప్.

వెనిజులా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం భారత్కు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే… ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.