గచ్చిబౌలి స్టేడియంలో 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్- 2025 పోటీలకు సంబంధించిన కార్యక్రమ ప్రారంభోత్సవం శుక్రవారం ఉదయం జరిగింది. దీనికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి సైతం హాజరయ్యారు.
ఈ సందర్బంగా జాతీయ కరాటే చాంపియన్ షిప్ నిర్వాహకులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కరాటే బ్లాక్ బెల్ట్ ప్రధానం చేశారు. అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ఇరువురు కలిసి కరాటే ఫైట్ చేస్తున్నట్లుగా ఫొటోలకు ఫోజులిచ్చారు.కాగా, మూడు రోజుల పాటు జరగనున్న కియో నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల ప్రారంభోత్సవానికి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ సైతం హాజరవ్వడం విశేషం.