చాలా ముఖ్యం; బడ్జెట్ లో ఇవి తప్పక తెలుసుకోండి…!

-

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్ లో 2020-21 బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపధ్యంలో ఇప్పుడు దేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. బడ్జెట్ లో వచ్చే మార్పులు ఏంటీ అనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మధ్యతరగతి బతుకులు ఏమైనా మారతాయా అనే దాని మీద అందరికి ఇప్పుడు ఎంతో ఉత్కంట ఉంది. మరి కేంద్రం ఏ విధంగా అడుగులు వేస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో జనాలకు కొన్ని కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అందులో ప్రధానంగా 5 చాలా మందికి తెలుసుకోవాలనే తపన ఉంటుంది. అవి ఏంటీ అనేది చూద్దాం…

యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌; దీనినే వార్షిక ఆర్థిక నివేదిక అని పిలుస్తూ ఉంటారు. బడ్జెట్‌లో వార్షిక ఆర్థిక నివేదిక అనేది చాలా ముఖ్యమైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 కింద కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, ఖర్చుల నివేదికను ఇవ్వాలి. ఇదే వార్షిక ఆర్ధిక నివేదిక… ఏకీకృత నిధి, ఆకస్మిక నిధి, పబ్లిక్ అకౌంట్ అని అంటారు. ఇందులో ప్రతీ విభాగానికి ఆదాయం ఖర్చులు అప్పులు వెల్లడిస్తుంది కేంద్రం.

ఫిస్కల్ డెఫిషిట్; దీనినే ద్రవ్యలోటు. వాస్తవానికి ఏ ప్రభుత్వ బడ్జెట్ అయినా సరే తమ ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. దీనితో… అప్పుల ద్వారా మొత్తాన్ని సేకరిస్తారు. ఆదాయాన్ని మించి ఖర్చు చేయడమే ద్రవ్యలోటు.

ఫైనాన్షియల్ బిల్; దీనినే ఆర్థిక బిల్లు అని అర్థం. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వెంటనే ఆర్థిక బిల్లును కూడా ప్రవేశపెడతారు. అందులో కొత్తగా విధించిన పన్నులు, సవరణలు, ప్రతిపాదనలు, నియంత్రణలకు సంబంధించిన వివరాలను పొందుపరుస్తారు.

పబ్లిక్ ఎకౌంటు; భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 266(1) ఇది ఏర్పాటు చేస్తారు. పబ్లిక్ ఎకౌంటు ప్రకారం కేంద్ర౦ బ్యాంకర్‌లా సేవలు అందిస్తుంది. అంటే ఉద్యోగుల పీఎఫ్ సహా… చిన్నమొత్తాల పొదుపు లాంటి పథకాల కోసం దీనిని అమలు చేస్తారు. ఇలా సేకరించిన డబ్బుపై ప్రభుత్వానికి ఏ హక్కు ఉండదు. డిపాజిట్ చేసిన వాళ్లకు కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఖర్చు చెయ్యాలంటే పార్లమెంట్ ఉభయసభల ఆమోదం ఉండాలి.

రెవెన్యూ బడ్జెట్‌; దీనిలో ఆదాయ వివరాలతో పాటుగా ఖర్చుల వివరాలు పొందుపరుస్తారు. ఆదాయాన్ని ట్యాక్స్, నాన్-ట్యాక్స్ అని విభజిస్తారు. ట్యాక్స్ రెవెన్యూలో ఇన్‌కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఎక్సైజ్, కస్టమ్స్, సర్వీస్ పన్నులన్నీ దీనిలో ఉంటాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో రుణాలపై వడ్డీ, పెట్టుబడులపై డివిడెండ్లు ఉంటాయి.

క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్; అంటే ఆస్తుల్ని సృష్టించడానికి చేసే ఖర్చులు. రహదారులు, భవనాలు, డ్యామ్స్ నిర్మాణంతో పాటు ప్రభుత్వం ఇచ్చే రుణాలను ఇలా పిలుస్తారు.

రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌; ఎలాంటి ఆస్తుల్ని, ఆదాయాన్ని సృష్టించని ఖర్చులను ఇలా పిలుస్తారు. అంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, వడ్డీలు దీని కిందకు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news