కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అనగానే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎం తగ్గుతున్నాయి ఎం పెరుగుతున్నాయి అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఇక కేంద్రం బడ్జెట్ అనగానే మధ్యతరగతి ప్రజలు ఆసక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే కదా… ఏం తగ్గబోతున్నాయి ఎం పెరగబోతున్నాయి అని ఎక్కువగా బడ్జెట్ వైపు చూసేది మిడిల్ క్లాస్ కుటుంబాలే కదా… వాళ్ళకే అవసరం ఎక్కువ.
వాళ్లకు నిర్మలమ్మ బడ్జెట్ లో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపును రూ.5 లక్షల వార్షిక ఆదాయం వరకు పెంచింది. అయితే ఈసారి దాన్ని రూ.7 లక్షలకు పెంచుతుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అది గనుక జరిగింది అంటే చాలు మధ్యతరగతి ప్రజలకు కాస్త ఉపశమనం లభిస్తుందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.
ఇక అది జరిగితే… ఆదాయ౦ మిగలడంతో పాటుగా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి… పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దానితో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఆర్ధిక వ్యవస్థ పరుగులు పెట్టె అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.