తన రికార్డును తానే బ్రేక్ చేసిన నిర్మలా సీతారామన్

-

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్‌ ఇది. లోక్‌సభలో రెండున్నర గంటలకుపైగా బడ్జెట్‌ ప్రసంగం చేసిన నిర్మల.. గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశారు. ఆదాయపన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచ్చారు. మధ్య, ఎగువతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో మార్పులు చేశారు. చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రజల ఆదాయాలను పెంచే దిశగా బడ్జెట్ ఉంటుందని ఆమె ప్రసంగం మొద‌లుపెట్టారు.

యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని.. మహిళలు, మైనార్టీల సంక్షేమమే ధ్యేయమని ఆమె చెప్పారు. ఇదిలా ఉంటే.. 2019-20 సంవత్సరానికి గాను 02 గంటల 17 నిమిషాల పాటు నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. ఇప్పుడు తన రికార్డును తానే బ్రేక్ చేశారు. మొత్తం 2 గంటల 43 నిమిషాల పాటు నిర్విరామంగా ఆమె తన ప్రసంగ పాఠాన్ని కొనసాగించారు. అంటే దాదాపు 26 నిమిషాలు అదనంగా ఈ ఏడాది ఆమె ప్రసంగించారు. మధ్యలో కశ్మీరీకి సంబంధించిన ఓ కవితను చదివి సభను ఆకట్టుకున్నారు. ప్రతిపక్ష సభ్యులు సైతం ఆమె సుధీర్ఘ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news