టెలికాం రంగంలో పోటీ అనేది తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఒక్కో కంపెని ఇప్పుడు వినియోగదారులను ఆకట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. పోటీ ప్రపంచంలో నిలబడి వినియోగదారులను ఆకట్టుకోవడం అనేది సాధారణ విషయం కాదు. పైసా దగ్గరి నుంచి ఆఫర్లు ఇస్తూనే ఉండాలి. వినియోగదారులను పోగొట్టుకోకుండా కాపాడుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉండాలి కంపెనీలు.
కాని భారత సంచార్ నిగం లిమిటెడ్ అదే BSNL మాత్రం ఈ విషయంలో ఘోరంగా విఫలమైంది. “హలో హలో హలో.. వినపడటం లేదా హలో హలో… ఇదీ ఆరంభంలో BSNL పరిస్థితి. సిగ్నల్ సరిగా ఉండదు.. కట్ అయితే రెండు మూడు రోజులు సేవలు ఉండవు. ఇక ల్యాండ్ లైన్ సర్వీసు అయితే కష్టాలు వర్ణనాతీతం సర్వీసు లేకున్నా బిల్లు వస్తుంది. అధికారికి ఫిర్యాదు చేస్తే స్పందన ఉండదు!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కదా.. తన జీతం తనకు వస్తుంది .. జనం డబ్బు చెల్లిస్తున్నప్పుడు నాణ్యత లేనపుడు సేవలు అందనప్పుడు ఏం చేస్తారు..?” ఇది ఆ నెట్వర్క్ వాడే వాళ్ళ పరిస్థితి. దీనితో వినియోగదారులు జారిపోయారు. వేలాది మంది దాన్ని వదిలేసారు. దీనితో సంస్థ నష్టాల బాటలో నడిచింది. ప్రైవేట్ కంపెనీలు అంత వేగంగా సేవలు అందిస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థ మాత్రం లెక్క లేని తనంగా వ్యవహరించింది,
ఫలితంగా కోట్లాది రూపాయల నష్టాలను సంస్థ చవి చూసింది అనేది వాస్తవం. దీనితో ఉద్యోగులను స్వచ్చంద పదవీ విరమణ తీసుకోవాలని కోరగా భారీ స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా దాదాపు 90 వేల మంది సంస్థకు రాజీనామా చేసారు. జనవరి 31 చివరి రోజు కావడంతో మన రాష్ట్రంలో 5031 మంది ఉద్యోగులలు సంస్థకు రాజీనామా చేసారు. దీనికి బాధ్యత సంస్థదా ఉద్యోగులదా…? కనీస స్పందన లేనప్పుడు వాళ్ళకు జీతాలు ఎందుకు…?