ప్రతి రోజూ యాక్టివ్‌గా ఉండాలంటే ఏం చేయాలి?

-

కొంతమంది ఎప్పుడు చూసినా నవ్వుతూ యాక్టివ్‌గా ఉంటారు. మరికొంతమంది నాకెందుకే అన్నట్లు మూడీగా ఉంటారు. ఏ పని చేయాలన్నా బద్దకిస్తారు. దీనికి కారణం వారు బరువుగా ఉండడం వల్లనా లేదంటే ఎంకేదైనా సమస్యా. కామ్‌గా ఉండేవాళ్లు యాక్టివ్‌గా మారాలంటే కొన్ని పనులు చేయాలి. ఇలా చేస్తే సరిపోతుంది.

ఆఫీస్‌లో కొంతమందిని చూస్తూనే ఉంటాం. పైకి కిందకి తిరుగుతూనే ఉంటారు. వీరికి పనీబాటా లేదా అనుకుంటాం. వీరు ఒకచోట కుదులుగా కూర్చోలేరు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆత్రుత చూపుతుంటారు. చెప్పిన పని నిమిషాల్లో చేసి టైంపాస్‌ చేస్తుంటారు. వీరికి బాధ్యతలు కూడా లేవేమో అనుకుంటాం. అలా అనుకుటే పొరబడినట్లే. ఈ విధంగా చురుగ్గా ఉండడం వల్లే బాధ్యతలను మనసులోనే దాచుకొని పనులన్నీ చక్కగా నిర్వర్తిస్తుంటారు.

ఏం చేయాలి?

ఆకలిగా ఉండడం వల్ల యాక్టివ్‌గా లేమనుకుంటాం. అలా అని శక్తినిచ్చే ఆహారం తీసుకున్నా చురుగ్గా ఉండలేం. ప్రతి పని చురుగ్గా అసలు చెయ్యలేం. తినే ఆహారంలో పోషకాహారం ఎక్కువ తీసుకోవాలి. అంటే మనం తీసుకొనే ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, చేపనూనె, అవిసెలు వంటి హెల్తీ ఫ్యాట్స్‌తో కూడిన సమతులాహారాన్ని తీసుకోవాలి.


– ఓకేసారి కడుపునిండా ఆహారం తీసుకొనేకంటే ఒక గిన్నెలో ఆహారం పెట్టుకొని ప్రతి మూడుగంటలకు ఒకసారి తినాలి. అప్పుడే ఈజీగా శక్తి వస్తుంది. తినే ప్రతి పదార్థంలో పోషకవిలువలు ఉండేలా జాగ్రత్తపడండి. వ్యాయామానికి శక్తినిచ్చేలా ఆ పోషకాలు ఉండాలి. ఆహారంలో క్యాలరీలు, ప్రోటీన్లు మెండుగా ఉండడంవల్ల శరీరం దృఢంగా ఉంటుంది.
– వీటన్నింటికంటే ముఖ్యమైనది శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. అలాగే వ్యాయామం చేసేటప్పుడు శరీర కండరాలు బాగా కదలాలి. అప్పుడే కండరాలు అంత పటిష్టమవుతాయి. శరీరంలోని కొవ్వు కరగాలంటే రోజూ తగినంత ప్రోటీన్‌ ఫుడ్‌ తీసుకోవాలి. అలాగే క్యాలరీలు తక్కువ ఉండేలా చూసుకోవాలి.
– ఈ చిట్కాలను పూర్తిగా ఫాలో అవ్వకపోయిన కొన్ని పాటించండి చాలు. అందరిలో కల్లా మీరే ఉత్సాహంగా, చురుగ్గా కనిపిస్తారు. మీ బాస్‌తో శభాష్‌ అనిపించుకోవడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news