హెచ్‌సీయూ భూమి వివాదంపై రాష్ట్రంలో గందరగోళం నెలకొంది. మరోవైపు జాతీయ స్థాయిలో హెచ్‌సీయూలోని వన్యప్రాణులు, విద్యార్థుల ప్రొటెస్ట్ గురించి పెద్దఎత్తున కథనాలు వస్తుండటంతో ఏఐసీసీ ఫోకస్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు.
శనివారం మధ్యాహ్నం ఆమె నగరానికి చేరుకుని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వం నియమించిన కమిటీతో సాయంత్రం భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఎన్ఎస్‌యూఐ నేతలతోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం.కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి తెరదించేలా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కమిటీని నియమించింది. మరోవైపు ఈ వ్యవహారం పై సీఎస్, అటవీ,రెవెన్యూ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు. మీనాక్షి రాకతో రాష్ట్రంలో ఏం జరగనుందో అనే చర్చ జరుగుతున్నది.