తెలంగాణ ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తెలంగాణ ఉద్యమకారుడు, భారత రాష్ట్రసమితి ప్రధాన కార్యదర్శి గాదె ఇన్నయ్య అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకోవాలని హితవు పలికారు.
HCU విద్యార్థుల పోరాటం ఎవరో వెనుక ఉండి నడుస్తున్న పోరాటం కాదని.. అనవసరంగా తప్పుగా మాట్లాడి పరువు తీసుకోవద్దని సూచనలు చేశారు. ఇదిలాఉండగా, హెదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలిలో గల 400 ఎకరాలను వేలం వేయొద్దని ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గత కొద్ది రోజులుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల న్యాయకులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే, దీని వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని అధికార పార్టీ ఆరోపిస్తున్నది.