ఉగ్రవాది కరీం తుండా తీర్పు వాయిదా…!

-

కరుడు గట్టిన ఉగ్రవాది ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండా కేసులో నాంపల్లి కోర్టు మళ్లీ తీర్పుని వాయిదా అవేసింది. కేసును విచారణ జరుపుతున్న న్యాయమూర్తి సెలవులో ఉండడంతో తీర్పును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తుండా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ జైలులో ఉన్నాడు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టులో హాజరుపర్చాలని పోలీసులు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

1993లో వరుస పేలుళ్లకు కుట్ర పన్నిన తుండా పలు బాంబు పేలుళ్ళ కేసులో నిందితుడి గా ఉన్నాడు. ఏడేళ్ళ క్రితం కరీం తుండాను నేపాల్‌లో అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టు ఫిబ్రవరి 4న విచారణ జరిపింది. తుది తీర్పును ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం దేశ వ్యాప్తంగా పలు అల్లర్లకు వ్యూహ రచన చేసాడు. కొన్నేళ్ల పాటు పాకిస్థాన్‌లో తలదాచుకున్నట్లు గుర్తించారు.

జిమ్ ఇస్లామిక్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థలో తుండాకీలకంగా వ్యవహరించాడు. హైదరాబాద్‌లోనూ బాంబు పేలుళ్ల ప్రణాళికకు సంబంధించి తుండాపై పలు కేసులు నమోదు చేసారు. పేలుళ్ల ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ హుమాయున్ నగర్, సీసీఎస్ వద్ద టిఫిన్ బాక్సుల్లో బాంబులు కూడా మార్చాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద కూడా చిన్న బాక్సుల్లో బాంబులు అమర్చి పేలుళ్లకు ప్రయత్నాలు చేసాడు.

Read more RELATED
Recommended to you

Latest news