తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇక నుంచి 10-15 నిమిషాల్లోనే భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. ఇందుకోసం రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ప్రారంభం కానుంది.
తొలుత ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్లాట్ బుకింగ్ ద్వారా 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని వెల్లడించారు. ఇక నుంచి కార్యాలయాల్లో గంటలు గంటలు వేచి ఉండాల్సిన అవసరం లేదని.. ప్రజలకు సులభతరమైన సేవలు అందించేందుకు ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చామని మంత్రి పొంగులేటి వివరించారు.