మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే పోషక విలువలు ఉండే ఆహారం తో పాటుగా సరైన నిద్ర కూడా ఎంతో అవసరం. సరైన సమయానికి నిద్రపోవడం వలన ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉంటుంది. చాలా శాతం మంది రాత్రి సమయంలో స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తూ నిద్రకు సంబంధించిన సమస్యలను తెచ్చుకుంటున్నారు. సరైన సమయానికి నిద్ర పట్టడం వలన ఎన్నో సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా సరైన నిద్ర లేకపోవడం వలన ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దీంతో మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవన శైలిలో మార్పులు చేయడం వలన మంచి నిద్రను పొందవచ్చు.
ఎప్పుడైతే ఆలస్యంగా నిద్రపోతారో అదే అలవాటుగా మారుతుంది. దీతో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది నిద్ర పోయే సమయంలో మంచం మీద పడుకున్న వెంటనే మంచి నిద్రను పొందుతారు మరియు ఉదయాన్నే నిద్ర లేస్తారు. కాకపోతే మరికొందరు ఎంతసేపు నిద్రపోవాలని ప్రయత్నించినా అస్సలు నిద్రపోరు. దానివలన ఉదయం మెలుకువ కూడా రాదు. దీంతో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇదే కొనసాగితే డిప్రెషన్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఎప్పుడైతే ప్రతిరోజూ ఆలస్యంగా నిద్రపోతారో నిద్రకు సంబంధించిన క్వాలిటీ తగ్గిపోతుంది.
దీంతో ఉదయాన్నే ఏకాగ్రత తక్కువగా ఉంటుంది పైగా సరైన విధంగా పని చేయలేరు. పరిశోధనల ప్రకారం సరైన సమయానికి నిద్రపోకపోవడం వలన డిప్రెషన్ మాత్రమే కాకుండా అల్జీమర్స్ వంటి ఎంతో ప్రమాదకరమైన సమస్యలు కూడా వస్తాయని తేలింది. కనుక కొన్ని రోజులు పాటు సరైన నిద్రను పొందకపోతే నిద్ర సమయాన్ని మార్చుకోవడం, జీవన శైలి లో మార్పులు చేసుకోవడం వంటివి చేయాలి. ఇలా చేస్తే ప్రమాదకరమైన సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. దీంతో ఎంతో ఆరోగ్యంగా జీవించవచ్చు.