రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని వారు సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే ఎలాంటి షరతులు లేకుండా క్రమబద్ధీకరించిన తర్వాతే.. యూనివర్సిటీల్లో రిక్రూట్ మెంట్ చేపట్టాలని మాసబ్ ట్యాంక్ ఉన్నత విద్యామండలి దగ్గర కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసనకు దిగారు.కాగా, నిరసనకు దిగిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.