మాజీ సీఎం జగన్ నిన్న రాప్తాడులో పర్యటించిన విషయం తెలిసిందే. వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు గురవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు హెలికాప్టర్‌లో జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు. రాప్తాడు జగన్ పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగింది. అక్కడే విధుల్లో ఉన్న రంగారెడ్డి అనే కానిస్టేబుల్ అస్వస్థతకు గురయ్యాడు.
వెంటనే అతన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.విషయం తెలుసుకున్న మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు ఎంఎస్ రాజు ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు.బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా, జగన్ రాప్తాడు పర్యటనలో భాగంగా ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు, వైసీపీ శ్రేణులు రాగా తొక్కిసలాట జరిగింది.