ఏదో ఒకరోజు మోదీ దేశాన్ని అమ్మేస్తారు: ఖర్గే

-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏదో ఒకరోజు మోదీ దేశాన్ని అమ్మేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలను మోసపూరితంగా ఓడించారని ఆరోపించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో ఖర్గే ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ఠ యావత్ ప్రపంచం ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్ వైపుగా మారుతుంటే, మన దేశంలో ఈవీఎంలను వినియోగిస్తుండటం విడ్డూరంగా ఉంది. ఈవీఎంలతో జరుగుతున్నదంతా మోసమే. ఇండియాలోనూ బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలి. ఇందులో యావత్ దేశపౌరులంతా ఒక్కటవ్వాలి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తి బ్యాలెట్ ఎన్నికల కోసం పోరాడాలి. అధికార పార్టీలకు లబ్ధి చేకూరేలా ఈవీఎంలలో మార్పులు చేయించారు. మహారాష్ట్రలో జరిగినట్లుగానే హర్యానా ఎన్నికల్లో జరిగింది. ఓటర్ల జాబితాను ఇష్టమొచ్చినట్లు రూపొందిస్తున్నారు. మేం దొంగలను బయటపెడతాం. మా నిపుణులు, న్యాయవాదులు అందుకోసం నిరంతరం శ్రమిస్తున్నారు.ఠ అంటూ ఖర్గే వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news