వరంగల్ నిట్ నిట్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉందన్నారు.. రాష్ట్ర, దేశ ప్రయోజనాలకు అతీతంగానే ప్రజాప్రతినిధులు పాలన సాగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన్ ధన్ యోజన పథకంలో భాగంగా ప్రతీ పేదవారు బ్యాంక్ అకౌంట్లను తెరిచారు.. మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విమర్శలు చేసిన వారే ..నోట్ల రద్దు తర్వాత ఆ అకౌంట్లకు ఉన్న డిమాండ్ ని గుర్తించారు. బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా నల్లధనానికి రూపుమాపొచ్చన్నారు. యువత దేశ అభ్యున్నతికి పాటుపడే విధంగా వినూత్న ఆవిష్కరణలు చేపట్టాలని ఆకాంక్షించారు.