తెలంగాణలో రీఎంట్రీ ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.హైదరాబాద్‌లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరియు పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ షోటైమ్ రాబిన్ శర్మలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ తాజాగా కలిశారు. వీరి భేటీ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణలో పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పీకేను కలిసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ టీడీపీ రీ ఎంట్రీ కోసం ప్రణాళికను అందించినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే చంద్రబాబు తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయడానికి గ్రౌండ్ ప్లాన్ ప్రిపేర్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌లో టీడీపీ సభ్యత్వ నమోదును తెలుగుదేశం పార్టీ నేతలు చేపట్టారు. రానున్న రోజుల్లో పార్టీకి మంచి రోజులు వస్తాయని గ్రేటర్ టీడీపీ నేతలకు భరోసా నిస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణలో రీ ఎంట్రీకి టీడీపీ ప్లాన్ రెడీ!
హైదరాబాద్‌లో ప్రశాంత్‌కిషోర్ మరియు పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ షోటైమ్ రాబిన్ శర్మ లను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్
తెలంగాణ టీడీపీ రీ ఎంట్రీ కోసం ప్రణాళికను అందించినట్లు సమాచారం pic.twitter.com/4HZPCnnvWU
— Telugu Scribe (@TeluguScribe) December 28, 2024