తన కుటుంబంలో అజ్ఙాతంలోకి వెళ్లినట్లు వస్తున్న వార్తలపై పేర్నినాని స్పందించారు. ఏదో రకంగా నన్ను, నా భార్యను అరెస్టు చేయాలని రాజకీయ కక్ష్యతో చేశారని… చాలా మంది చాలా మాట్లాడారు.. పారిపోయాను అన్నారని ఆగ్రహించారు. నేనేమీ ఎక్కడకు పారిపోలేదని క్లారిటీ ఇచ్చారు. మీ కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద కేసులు పెడితే వారిని రక్షించివాలని చూస్తారా.. లేక జైలుకు పంపిస్తారా.. అంటూ ఫైర్ అయ్యారు.
నేను తప్పు చేసానని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా..కేవలం అద్దెకు ఆశపడి గోడౌన్ కట్టటం తప్ప మేము చేసిన తప్పేంటి..అంటూ నిలదీశారు. నిజంగా తప్పుడు పనులు చేయాలంటే ఎవరైనా ఇలా చేస్తారా.. నేనేమైనా తప్పుడు పనులు చేసే వ్యక్తినా..అని నిలదీశారు. ఒక రాష్ట్రానికి మంత్రిగా చేసిన వ్యక్తిని.. ఉద్దేశ్య పూర్వకంగా పనిచేస్తానా అంటూ ప్రశ్నించారు పేర్ని నాని. మహిళల జోలికి వెళ్లొద్దని చంద్రబాబు చెప్పారు… సీఎం చెప్పినప్పటికీ వాళ్లు ప్రయత్నాలు ఆపడం లేదని ఆగ్రహించారు.