పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టి భారీ మోసానికి తెర లేపిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ తాజాగా బెల్జియంలో అరెస్టు అయిన విషయం తెలిసిందే. భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా ఆయన అరెస్టుపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ స్పందించారు. మెహుల్ ఛోక్సీ అరెస్ట్ గొప్ప విజయమని కేంద్రం ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ అన్నారు.
విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకొస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారు. ఆ హామీని నెరవేరుస్తున్నారు. పేదలను దోపిడీ చేసిన వాళ్లను మోదీ వదిలిపెట్టరు. పరారీలో ఉన్న మెహుల్ ఛోక్సీ వంటి వాళ్లను ప్రధాని మోదీ వదిలిపెట్టరు. ఇలాంటి వ్యక్తులపై మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఛోక్సీ అరెస్ట్ అతిపెద్ద విజయం. అయితే ఛోక్సీ బెయిల్ కోసం వెళ్లాలని చూస్తున్నారు. అలా జరగకుండా చూస్తాం’ అని పంకజ్ చౌధరీ అన్నారు.