టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య హోరా హోరీ పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ బౌలింగ్ చేయనుంది. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి చెందిన పంజాబ్ ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని చూస్తోంది. కోల్ కతా కూడా ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ లలో 3 మ్యాచ్ ల్లో విజయం సాధించి.. మరో మ్యాచ్ లలో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఈ హోరా హోరీ పోరులో ఎవ్వరూ గెలుస్తారో వేచి చూడాలి మరీ.

కేకేఆర్ జట్టు : డికాక్, నరైన్, రహానె, రింకూ, వెంకటేష్ అయ్యర్, రసెల్, రమణ్ దీప్, వైభవ్, నొర్కజా, హర్షిత్, వరుణ్.

పంజాబ్ కింగ్స్ జట్టు : ప్రియాంశ్, ప్రభ్ సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్, ఇంగ్లీషు, వధేరా, శశాంక్, మ్యాక్స్ వెల్, జాన్సెన్, బార్ట్లెట్, చాహల్, అర్షదీప్.

Read more RELATED
Recommended to you

Latest news